ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫోటోలు అమర్చరాదు. దేవుళ్ళ ఫోటోలను అమర్చాలి. వీలుంటే వినాయకుని ఫోటో అమర్చాలి.
ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు,పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తువుంటారు.వాటిని అవసరం తీరగానే ఆకన్నాలు మూసెయ్యాలి.
వాయువ్యం పెరిగిన,మూతపడిన ఇంకే వాయువ్య దోషాలు ఉన్న వాయువ్యంలో వాయు పుత్రుడైన హనుమంతుని ఉంచి పూజించిన ఆ దోషాల తీవ్రత తగ్గును.
తూర్పు ఈశాన్యం,ఉత్తర ఈశాన్యం,పడమర వాయువ్యం,దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం,పడమర నైరుతి,దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు దోషపూరితం.

బీరువాలు నైరుతి యందుంచి, ఉత్తరమునకు తెరుచునట్లు ఉంచాలి.
తూర్పు మరియు ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లను పెంచరాదు.
మూడు పసుపు కొమ్ములు,పసుపు దారంతో షాపు గుమ్మానికి వ్రేలాడదీయండి. దృష్టి దోషం పోతుంది మరియు వ్యాపారాభివృద్ధి ఉంటుంది.
పడమట వైపు స్తలం కొనుక్కొన్న భార్యకు అనారోగ్యం,నష్టం కలుగును.
ఈశాన్యంలో బరువు ఉంచరాదు. పడమర వైపు, దక్షిణం వైపు బరువులు ఉంచవచ్చును.
దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించరాదు. ఉండరాదు.
పాముల పుట్ట ఉన్న స్థలం కొనరాదు. కొని పుట్ట తొవ్వి తీసుకోవచ్చు అనుకొంటే, ఆ కుటుంభానికి తరతరాలుగా నాగ దోషం పట్టుకొంటుంది. దాని వలన సంతాన నష్టం జరగటం, కుంటి, గుడ్డి, మూగ, చెముడు పిల్లలు జన్మించుట, ఆ పిల్లలు ఆకాలంలో మరణించుటం జరుగుతుంది.

లక్ష్మి అనుగ్రహానికి.!ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే 
ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు ఉండాలట. 
ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీకి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇంతకీ గుమ్మం ముందు ఏమి ఉంటె లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఓసారి చూద్దాం.. 
ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి. ఇది తప్పనిసరిగా చెయ్యాల్సిన పని. ఎందుకంటే స్మశానం ముందున ముగ్గు వెయ్యరు. కనుక ఇంటి ముందు శుభప్రదంగా ముగ్గు వెయ్యాలి. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి. 
లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదోఒకరకం పువ్వులు పెడితే మంచిది. 
గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. 
గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో 5 రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.స్వస్తి..!!💐
ఓం నమః శివాయ..!!🙏శ్రీ మాత్రే నమః..!!🙏

ఉత్తరం (North) వైపు తల పెట్టి నిద్రించకూడదు. ఎందుకు??💐శ్రీ💐శ్రీ మాత్రే నమః..!!🙏
ఈ విశ్వాసం మన పూర్వం నుండే ఉంది. మీ ఇళ్ళలో అమ్మమలు, తాతయ్యలు ఉండి ఉంటే కచ్చితంగా మీరు కూడా ఇది వినే ఉంటారు. 
పడుకోనేప్పుడు ఉత్తరం (North) వైపు నిద్రించకూడదంటారు. మన పురాణంలో విఘ్నేశ్వరుడు కి తల పెట్టడానికి ఉత్తరాన పడుకొని ఉన్న ఎనుగు తల నరికి తెచ్చారు. అందుకనే ఉత్తరాన పడుకోవాడం కష్టాలు కొని తెచ్చుకోవడం అని భావించి ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకుడదంటారు. 
కాని దీని వెనుక scientific reason కూడా ఉందండొయి. భూమిలో magnetic force ఉత్తర దక్షిణలుగా ఇమిడి ఉంటుంది. 
మనం ఉత్తరాన పడుకున్నామంటే ఉత్తర దక్షిణలుగా (north & south )ఇమిడి ఉన్న magnetic force మన mind లోని energetic electric force ని తగ్గించి వేస్తాయి. దీని వల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. 

అంతే కాదండీ blood circulation system లో కూడా changes వస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. 
every year India moves towards north pole 5cm. చూసారా north కి ఎంత magnetic force ఉందో. 
అలా కాకుండా పడమర (west) వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగు పడుతుంది. blood circulation సరిగ్గా జరిగి body energetic గా చేస్తుంది. 
so ఇక నుండి ఉత్తరం వైపు పడుకోవడం మూఢ నమ్మకంగా భావించకుండా దీని scientific reason తెలుసుకోండి. తెలుసుకున్నది అందరికీ చెప్పండి.